వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణ మెర్సీ కిల్లింగ్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: అరవై ఏళ్ల నర్సు అరుణ షాన్‌బాగ్ మెర్సీ కిల్లింగ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. తనపై కిరాతకంగా లైంగిక దాడి జరిగిన తర్వాత కోమాలోకి వెళ్లిన ఆమె గత 37 ఏళ్లుగా ముంబైలోని ఆస్పత్రిలో కోమాలో ఉంది. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని అరుణ్ రామచంద్ర షాన్‌బాగ్ తరఫున దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు మార్కండే కట్జ్, జ్ఞాన్ సుధ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

అరుణ మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాల్సిన అవసరం లేదని ఆమె కేసులోని వాస్తవాలు, పరిస్థితులు, వైద్య సాక్ష్యాలు, ఇతర వివరాలు సూచిస్తున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. మెర్సీ కిల్లింగ్‌కు సంబంధించి దేశంలో ఏ విధమైన చట్టం లేదని చెప్పింది. పార్లమెంటు చట్టాన్ని సవరిస్తే తప్ప అందుకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

English summary
In a keenly-awaited verdict, the Supreme Court on Monday dismissed a plea for mercy killing on behalf of a 60-year-old nurse, living in a vegetative state for the last 37 years in a Mumbai hospital after a brutal sexual assault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X