కంట తడి పెట్టిన నాగం జనార్దన్ రెడ్డి: తెలంగాణవాదుల మద్దతు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: 1969నాటి తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థులను కోల్పోయిన ఘటన నా కళ్లముందే ఉందని దానిని ఎలా మర్చిపోగలనని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం గన్‌పార్క్ వద్ద విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. అసెంబ్లీలో పార్టీతో విభేదించి సభలో తెలంగాణవాదం వినిపించిన నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతుగా పలువురు లాయర్లు గన్‌పార్కు వద్దకు ర్యాలీగా వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. నాటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే నేను నడుచుకుంటానని చెప్పారు. పార్టీలకతీతంగా, జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాడాల్సిన సమయం ఇదే అని నాగం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఎజెండాయే నా ఎజెండా అన్నారు. తెలంగాణ న్యాయవాదుల భేటీలో ఆయన కన్నీరు పెట్టారు.
తెలంగాణ ప్రజలు మనలను ఎందుకు గెలిపించారో గుర్తు చేసుకోవాలని మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణకు టిడిపి ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని ఆయన కోరారు. గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఇప్పుడు ఏమీ మాట్లాడక పోవడం వల్లనే టిడిపినుండి తాను రెండునెలల క్రితం బయటకు వచ్చానని చెప్పారు. కాగా నాగంకు మద్దతుగా తెలంగాణలోని పది జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. అసెంబ్లీలో నాగంకు సహకరించని టిడిపి ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, కరీంనగర్‌లో, నల్గొండ జిల్లా తిరుమలగిరిలో మోత్కుపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నాగం జనార్ధన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు తొత్తులుగా మారకుండా తెలంగాణ కోసం ఉద్యమించాలన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించని ప్రజా ప్రతినిధులను నియోజకవర్గాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. నాగంకు విద్యార్థుల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
Telanganites supported TDP senior MLA Nagam Janardhan Reddy attitude in assembly. They organiged rally, agitations at their stations. They fired effigy of TDP MLAs.
Story first published: Monday, March 7, 2011, 14:46 [IST]