జగన్‌కు పెరుగుతున్న మద్దతు: చెంతకు జ్యోతుల, దొరబాబు

భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యుడు పెండెం దొరబాబు, పీఆర్పీకే చెందిన జివివి రమణ, అత్తిలి రామస్వామి తదితరులు సైతం జగన్‌కు అండగా రావడానికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం జగ్గంపేటలో జరిగే జగన్ బహిరంగ సభకు వీరు హాజరయి తమ మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించడానికి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గురువారం జగ్గంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రముఖ నేతలు జగన్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా జగన్ పక్షాన ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications