ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి అధికారులపై ఎసిబి దాడులు: ఇద్దరు అధికారుల వద్ద రూ.10కోట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇద్దరు అధికారుల ఇంటిపై బుధవారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని హిమయత్ నగర్‌లో ఉంటున్న ట్రాన్స్ కో ఏడి చిత్తరంజన్ దాస్ ఇంటిలో దాడులు నిర్వహించింది. సుమారు 5 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, 5 ఓపెన్ ఫ్లాట్లు, మహబూబాబాద్‌లో 7 ఎకరాల భూమి, గంగోత్రి రియల్ ఎస్టేట్‌లో సుమారు 25 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలను వడ్డీలకు తిప్పుతున్న పత్రాలు కనుగొనడంతో పాటు 10.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు జట్లు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నాయి. చిత్తరంజన్‌కు అత్యంత సన్నిహితులు అయిన వారి ఇంటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

కాగా అదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ చెక్ పోస్టు అధికారిగా పని చేస్తున్న జావెద్ అలీ ఇంటిపై కూడా ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. జావెద్ హైదరాబాదులో నివాసం ఉంటూ అక్కడికి వెళ్లి వస్తుంటాడు. ఈయన వద్ద కూడా రూ.5కోట్లకు పైగా అక్రమ ఆస్తులు అధికారులు గుర్తించారు. లక్సెట్టిపేట, హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈయన ఆస్తుల కోసం నాలుగు టీంలు రంగంలోకి దిగాయి.

English summary
ACB raided on two corrupted officers today. Transco AD Chittaranjan Das in Hyderabad, Jahed Ali in Adilabad. ACB found near 5 crores of illegal amount each of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X