వైయస్ జగన్ ఆస్తులపై అసెంబ్లీలో తీవ్ర రగడ, వాయిదా

జగన్ ఆస్తుల గొడవతో శాసనసభ సమావేశం ప్రారంభమైన కాసేపటికే అరగంట వాయిదా పడింది. ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ విపక్షాలు కోరిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. సభలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సభ్యులు జై తెలంగాణ నినాదాలు చేశారు. చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగించవలసిందని ఉపసభాపతి మంత్రులను కోరారు. అయినా జగన్ ఆస్తులపై చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టు పట్టారు.
కడప, హైదరాబాద్‌లలో నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులపై చర్చకు పట్టుపట్టింది. సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని, సహకరించాలనని సభ్యులను కోరిన ఉప సభాపతి ఫలితం లేకపోవడంతో సభను అరగంట వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications