కూతురు శ్రీజ వివాదంతో మెగస్టార్ చిరంజీవికి తలనొప్పి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్:
కూతురు
శ్రీజ
వివాదం
ప్రజారాజ్యం
పార్టీ
అధినేత
చిరంజీవికి
తలనొప్పిగా
పరిణమించిందనే
చెప్పాలి.
ప్రజారాజ్యం
పార్టీని
స్థాపించడానికి
ముందు
ఆమె
ప్రేమ
వివాహం
విషయంలో
చిరంజీవి
ఇబ్బందులే
ఎదుర్కున్నారు.
దాన్ని
దాదాపుగా
ఆ
సమయంలో
పరిష్కరించుకున్నారు.
అలాగే,
తమ్ముడు
పవన్
కళ్యాణ్‌కు
మొదటి
భార్యతో
ఉన్న
వివాదాన్ని
కూడా
సామరస్యవూర్వకంగా
పరిష్కరించుకున్నారు.
అయితే,
ప్రస్తుతం
పార్టీని
కాంగ్రెసులో
విలీనం
చేస్తున్న
సందర్భంగా
శ్రీజ
వివాదం
ముందుకు
వచ్చింది.
ప్రజారాజ్యం
పార్టీని
కాంగ్రెసులో
విలీనం
చేస్తూ
అవసరమైన
పత్రాలను
పార్టీ
నాయకులు
బుధవారం
ఎన్నికల
కమిషన్‌కు
సమర్పించారు.
కాంగ్రెసు
పార్టీలో
చిరంజీవికి
అతి
ముఖ్యమైన
స్థానం
లభిస్తుందని
ఊహాగానాలు
చెలరేగుతున్నాయి.
చిరంజీవికి
అనూహ్యమైన
స్థానం
లభిస్తుందని
ప్రదేశ్
కాంగ్రెసు
కమిటీ
(పిసిసి)
అధ్యక్షుడు
డి.
శ్రీనివాస్
ఇటీవల
అన్నారు.
ఇటువంటి
సందర్భంలో
తన
భర్త
శిరీష్
భరద్వాజ్‌పై
శ్రీజ
వరకట్నం
వేధింపుల
కేసు
పెట్టడం
చిరంజీవికి
ఇబ్బంది
కలిగించే
విషయమే.
అయితే,
చిరంజీవి
మాత్రం
ఇప్పటి
వరకు
శిరీష్‌ను
తన
అల్లుడిగా
స్వీకరించడానికి
ముందుకు
రాలేదని
అంటున్నారు.
శ్రీజ
చిరంజీవి
ఇంటికి
వస్తూ
పోతూనే
ఉన్నది.
గత
కొంత
కాలంగా
ఆమె
చిరంజీవి
ఇంట్లోనే
ఉంటున్నట్లు
కూడా
చెబుతున్నారు.
చిరంజీవి
తనను
స్వీకరించడానికి
సిద్ధంగా
లేకపోవడంతో
శిరీష్
భరద్వాజ్
అహం
దెబ్బ
తిందని
అంటారు.
కూతురును
ఆహ్వానించినప్పటికీ
తనను
చిరంజీవి
దూరంగానే
ఉంచుతారనే
విషయం
భరద్వాజ్‌కు
అర్థమైందని
చెబుతున్నారు.
కాగా,
ప్రేమ
పెళ్లి
వల్ల
తండ్రి
చిరంజీవి
ఎంతగా
బాధపడ్డారో,
ఎంత
కోపంగా
ఉన్నారో
వీలు
దొరికినప్పుడల్లా
కుటుంబ
సభ్యులు
శ్రీజకు
క్లాస్
తీసుకోవడం
ప్రారంభించారట.
ఈ
స్థితిలోనే
శ్రీజ
భర్తకు
దూరం
కావాలని
నిర్ణయించుకున్నట్లు
చెబుతారు.
Prajarajyam party president Chiranjeevi may be irked by his daughter Srija's issue. Chiranjeevi may face questions from pilitical circle regarding Srija's complaint against her husband.
Story first published: Wednesday, March 16, 2011, 18:35 [IST]