వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ వర్గానిది రాజకీయ వ్యభిచారం, ఎన్నికల్లో తేల్చుకోండి: దేవినేని ఉమ

జగన్ వర్గం నేతలు ముందుగా తాము ఎవరిని ఎన్నుకుంటారో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఈ నెల 17న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారో మొదట వారు చెప్పాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై సుప్రీంకోర్టులో కేసు వేసి ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు అబద్ధమని తెలిసే దానిని ఉపసంహరించుకున్నారన్నారు. జగన్ అక్రమాలపై ప్రభుత్వం జెఎల్పీ వేసే వరకు సభను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.