వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య సయోధ్యకు ఆజాద్

ఈ నెల 22వ తేదీ ఉదయం గులాం నబీ ఆజాద్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. అదే రోజు సాయంత్రం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమవుతారు. మర్నాడు ఈ నెల 23వ తేదీన ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులను కలిపి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ విషయంపై పార్టీ అధిష్టానం ఉద్దేశం ఎలా ఉందనేది ఆయన సూచనప్రాయంగా వారికి చెప్పే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన సూచించే అవకాశం ఉంది.
కాగా, ఐదు రాష్ట్రాల శానససభల ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ అంశంపై దృష్టి పెడతామని కాంగ్రెసు అధిష్టానం చెబుతోంది. అప్పటి వరకు వేచి చూడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులున్నారు. మేలో తెలంగాణపై కసరత్తు చేసి కాంగ్రెసు అధిష్టానం జూన్‌లో నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.