చెన్నై: 2జి స్కామ్ కేసు నిందితుడు, టెలికం మాజీ మంత్రి ఎ రాజా బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులో వ్యాపారవేత్త అయిన సాదిక్ బచ్చాకు రాజాతో వ్యాపార సంబంధాలున్నట్లు సమాచారం. అతను తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2జి స్కామ్‌లో దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు నిరుడు డిసెంబర్ సాదిక్ బచ్చా చెన్నైలోని ఇంటిలో, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అయితే, అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంటున్నారు.
సాదిక్ బచ్చా రియల్ ఎస్టేట్ సంస్థ గ్రీన్ హౌస్ ప్రమోటర్స్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థలో రాజా కుటుంబ సభ్యులకు వాటాలున్నాయి. కాగా, 2జి స్కామ్ కేసులో సిబిఐ మార్చి 31వ తేదీ లోగా రాజాపై, మరో రెండు సంస్థలపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ విషయాన్ని సిబిఐ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఇది ప్రారంభమం మాత్రమేనని, ఈ కేసులో మరింత మందిపై తర్వాత చార్జిషీట్ దాఖలు చేస్తామని సిబిఐ అధికారులు చెబుతున్నారు.
Former telecom minister A Raja's aide and realtor Sadiq Basha was found dead, hanging, at his residence in Chennai on Wednesday. CBI had questioned Basha in connection with the 2G spectrum scam.
Story first published: Wednesday, March 16, 2011, 14:52 [IST]