హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అసెంబ్లీకి పిండ ప్రధానం చేస్తామన్న వ్యాఖ్యలపై చేనేత, జౌళీ శాఖామాత్యులు శంకర రావు బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోదండరామ్ వ్యాఖ్యలు శాసనసభను అగౌరవపరిచేలా ఉన్నాయన్నారు. శాసనసభను అగౌరవపరిచేలా మాట్లాడిన కోదండరామ్‌పై స్పీకర్ నాదెండ్ల మనోహర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
కోదండరామ్ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ అంటే కోదండరామ్‌కు గౌరవం లేకనే అలా మాట్లాడారన్నారు. ఈ విషయంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. అవసరమైతే సభా హక్కుల నోటీసు కూడా ఇస్తానని చెప్పారు.
Minister Shankar Rao condemned today Telangana political jac chairman Kodandaram last ritual comments on assembly. He said he will complaint deputy speaker on Kodandaram.
Story first published: Wednesday, March 16, 2011, 14:59 [IST]