హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీ రావుపై వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేల ఎదురు దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-Ramoji Rao
హైదరాబాద్‌: తమ నాయకుడు వైయస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఈనాడు దినపత్రికలో వార్తాకథనాన్ని ప్రచురించిన రామోజీరావుపై, ఆ వార్తాకథనం ఆధారంగా శానససభలో దుమారం రేపిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ఎదురుదాడికి దిగారు. జగన్ అక్రమాస్తులపై శాసనసభా సంఘం వేయాలని తెలుగుదేశం శాసనసభలో చేసిన డిమాండ్‌పై వారు తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు బాబూరావు, శ్రీకాంత్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, శోభా నాగిరెడ్డి తదితర శాసనసభ్యులు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జగన్ ఆస్తులపై సభా సంఘం వేస్తే ఆ సంఘం విచారణ పరిధిలోకి చంద్రబాబు ప్రభుత్వం హయాంలో జరిగిన వ్యవహారాలను కూడా చేర్చాలని వారు డిమాండ్ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో1995 నుంచి 2004 వరకు రామోజీ రావు సంస్థలు లాభపడిన తీరుపై కూడా విచారణ జరిపించాలని వారు కోరారు. మార్గదర్శి వంటి పలు అక్రమ వ్యవహారాలు రామోజీ నడిపారని వారు అన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తాకథానాలను ఆధారం చేసుకుని శాసనసభలో ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి తగదని వారన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కమ్మక్కయ్యాయని, ఈ స్థితిని చూస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుందని వారన్నారు. తమ నాయకుడిపై ఆరోపణలు చేసినందుకు ప్రతిగా తాము ఆరోపణలు చేయడం లేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలు జరిగాయని, అవి కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని వారన్నారు.

వైయస్ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ స్పందిస్తోందని, అది సరి కాదని వారన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కాంగ్రెసులో విలీనం చేస్తే మంచిదని వారు అభిప్రాయపడ్డారు.

English summary
YSR Congress party leader YS Jagan group MLAs retaliated Eenadu Ramoji rao for making allegation against their leader. Babu rao, Srikanth Reddy, shobha nagireddy and others accused TDP president N Chandrababu Naidu for raising allegations made by Eenadu against YS Jagan in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X