జగన్‌తో భేటీ, కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలు షాక్ ఇస్తారా?

బుధవారం జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశానికి కొండా సురేఖ మినహా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులంతా పాల్గొన్నారు. దీంతో వారంతా కాంగ్రెసు అభ్యర్థులకు ఓటేస్తారనే అనుకున్నారు. అయితే, వారు సమయానికి ఏం చేస్తారనే ఉత్కంఠ మాత్రం ఉంది. వైయస్ జగన్‌తో గురువారం ఉదయం జరిగిన సమావేశంలో శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, జయసుధ, రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, గుర్నాథ రెడ్డి, శేషా రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, కుంజా సత్యవతి, కమలమ్మ, కె. శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాస రెడ్డి, బాలనాగి రెడ్డి, శోభా నాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
కొండా సురేఖ, రవి, సుచరిత, రామకృష్ణ, బాబూరావు, కాటసాని రామిరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత సంఖ్య చూస్తే వైయస్ జగన్ ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యుల సంఖ్య చూస్తే వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 25 దాకా ఉండే అవకాశం ఉంది. వీరిలో ఇద్దరేసి ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలకు చెందినవారు. మిగతావారంతా కాంగ్రెసు పార్టీకి చెందినవారే.












Click it and Unblock the Notifications