జగన్‌కు మరో దెబ్బ, వైయస్ భూముల కేటాయింపులపై రివ్యూ

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దేశంలోనే ఎక్కడా లేనంతగా సెజ్‌లకు అనుమతి ఇచ్చారు. సెజ్‌ల కోసం వివిధ సంస్థలకు భారీగా భూముల కేటాయింపు జరిగింది. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సెజ్‌లకు అనుమతి లభించింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 42 సెజ్‌లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని భూముల విలువ చుక్కలు దాటుతండడంతో ఆ కేటాయింపులు ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.
సెజ్‌లకు కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కూడా వైయస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో భూములు పొందిన సంస్థల ద్వారా వైయస్ జగన్ భారీగా లాభం పొందారనేది ప్రధాన ఆరోపణ. వీటి మూలంగానే జగన్ సంస్థల్లోకి ఆయా సంస్థల పెట్టుబడులు వచ్చి చేరాయని అంటున్నారు. దీంతో జగన్ సంస్థలను కట్టడి చేయడానికి సెజ్‌లకు కేటాయించిన భూములను సమీక్షించి, తిరిగి స్వాధీన పరుచుకోవడం ద్వారా జగన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీయవచ్చుననేది కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications