వైయస్ జగన్ వెంట సంఘ విద్రోహ శక్తులు: ఆనం వివేకానందరెడ్డి

Anam Vivekananda Reddy
హైదరాబాద్: మాజీపార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట అందరూ కోటీశ్వరులు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని మంగళవారం ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ శుద్ధ అబద్దమన్నారు. అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు. జగన్ పార్టీలో కోటీశ్వరులు ఉన్నారని వారు ఏమైనా చేయగలరని అన్నారు.

కాగా ప్రజాపద్దుల సంఘం సమావేశంపై కూడా ఆయన స్పందించారు. నాగం జనార్ధన్ రెడ్డి సమావేశాన్ని అకస్మాత్తుగా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత హడావుడిగా సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఆయన ఉద్దేశ్యం బయట పెట్టాలన్నారు. నాగం ఏర్పాటు చేసిన సమావేశానికి మేం వెళ్లమని చెప్పారు. ఆయన ఎవ్వరినీ నోరెత్తనివ్వరని అన్నారు. అయినా చైర్మన్ నోటిఫికేషన్ వచ్చినందున ఆయన పదవి ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా సీమాంధ్ర సభకు రానని ప్రకటించి నాగం పిఎసి సమావేశం ఎలా పెడతారని టిడిపి నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. రేపు సమావేశంలో ఈ అంశం లేవనెత్తుతామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+