తెలంగాణ, సీమాంధ్ర చిచ్చుకు సోనియానే కారణం: దేవినేని ఉమ

గత డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆ తర్వాత 23న సమైక్యాంధ్రకు మొగ్గు చూపుతూ అస్పష్ట ప్రకటనలు చేయడంతో రాష్ట్రంలో పరిస్థితి ఇలా తయారయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడుతుందని, జూన్‌లో తెలంగాణ వస్తుందని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయన్నారు. దీనిపై సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలన్నారు. సమైక్యాంధ్రను కోరుకునే సీమాంధ్ర ప్రజాప్రతినిధులుగా అందరూ దీనిపై స్పందించాలన్నారు. కాగా టిడిపి తెలంగాణ ప్రజాప్రతినిధుల తీరుపై ప్రశ్నించగా ఏ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications