హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని తానే అని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తే తెలంగాణ ఇస్తామని, జూన్‌లో ఈ మేరకు ప్రకటన చేస్తామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు కెసిఆర్ సోమవారం ఎస్ఎంఒల సమావేశంలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిని తానే అని కూడా పరోక్షంగా ఎస్ఎంఒలతో కెసిఆర్ అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. విలీనం వార్తల్లో నిజం లేదని, అటువంటి చర్చలేవీ జరగలేదని కెసిఆర్ ప్రకటించినట్లు కెసిఆర్ చెప్పినా ఆ వార్తలు ఆగడం లేదు.

కాగా, కాంగ్రెసులో తెరాసను విలీనం చేయాలనే ప్రతిపాదనను ఎస్ఎంఒలు వ్యతిరేకించినట్లు, అయితే రాష్ట్ర ఏర్పాటు కన్నా పార్టీ ముఖ్యం కాదని కెసిఆర్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. విలీనం తర్వాత కాంగ్రెసు మోసం చేస్తే ఎలా అనే ప్రశ్న కూడా సమావేశంలో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగంగానే ఉంటుందని, అయితే పది పదిహేనేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కెసిఆర్ చెప్పారని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ వార్తలను ప్రసారం చేస్తోంది. కాంగ్రెసులో తెరాసను విలీనం చేయకపోతే తెలంగాణ ఇచ్చేది లేదని కూడా సోనియా చెప్పినట్లు కెసిఆర్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
It is said that TRS president K Chandrasekhar Rao has claimed he will be the CM of Telangana state. KCR also said that party is not important than Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X