వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్నపనేనిపై చర్యలు తీసుకోవాలి: నాగం జనార్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: సొంత పార్టీలోనే తనపై ఆరోపణలు చేసిన వారిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం కోరారు. బుధవారం నాగం పిఏసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడంతో సమావేశంలో నాగంను నిలదీస్తానని నన్నపనేని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై విలేకరులు అడుగగా తనపై సొంత పార్టీ వారు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై ఆరోపణలు చేసిన నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిపై కూడా ఆయన స్పందించారు.

ఆనం వివేకానందరెడ్డి కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుంటారని ఆరోపించారు. ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అలాంటి ప్రకటనలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో అవినీతి చాలా జరిగిందన్నారు. జలయజ్ఞంలో సుమారు 2300 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దాని రిపోర్టులు తయారవుతున్నాయని చెప్పారు. దానిని త్వరలో బయటపెడతామని చెప్పారు.

English summary
TDP senior MLA Nagam Janardhan Reddy urged president Chandrababu today that to take action on Nannapaneni Rajakumari for blaming him. He accused Congress MLA Anam's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X