జూన్‌లో తెలంగాణ విలీనం, కాంగ్రెసులో తెరాస విలీనం?

కెసిఆర్‌కు సోనియా ఇచ్చినట్లు చెబుతున్న హామీపై ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, తెరాస కాంగ్రెసులో విలీనం కాదని తెరాస నాయకులు హరీష్ రావు, నాయని నరసింహా రెడ్డి, రఘునందన్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ పునర్నిర్మాణం బాధ్యత తమపై ఉందని వారంటున్నారు. అయితే, 2004లో తెలంగాణ ఇచ్చినట్లు తెరాసను కాంగ్రెసులో విలీనం చేయడానికి అంగీకరించి ఉండేవారని, ఇప్పుడు ఆలాంటిది సాధ్యం కాదని నాయని నరసింహా రెడ్డి అన్నారు.
తెరాస తమ పార్టీలో విలీనమైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. తాజాగా, పొన్నం ప్రభాకర్ కూడా అదే మాటను టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో చెప్పారు. ప్రాణత్యాగాల ముందు పార్టీ త్యాగం గొప్పది కాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పార్టీ త్యాగం తప్పదని కెసిఆర్ అన్నట్లు కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications