హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్‌ను అమ్ముకోండి, యాత్రల పరమార్థం ఏంటి: రేవంత్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేసినా, అమ్ముకున్నా తమకు అభ్యంతరం లేదని కాని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ప్రజా ఉద్యమాలను రాజకీయంగా వాడుకోవాలని కెసిఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ టిడిపిని చచ్చిన పీనుగు అనడాన్ని ఆయన ఖండించారు. చచ్చిన పీనుగు అంటూ మళ్లీ ఎందుకు పీక్కు తింటున్నారని ప్రశ్నించారు. టిడిపికి తెలంగాణలో గట్టి పట్టు ఉందని దానిని దెబ్బకొట్టాలని చూస్తున్నారని కానీ అది సాధ్యం కాదన్నారు.

టిఆర్ఎస్‌ను మీరు కాంగ్రెసులో విలీనం చేసినా అమ్ముకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఎప్పుడు పార్లమెంటులో ఎప్పుడు లేవనెత్తుతారన్నారు. తెలంగాణ అంటున్న కెసిఆర్ గత పది నెలలో ఏ ఉద్యమంలో పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్‌రోకో తదితర ఏ ఉద్యమంలో కేసిఆర్ పాల్గొనలేదన్నారు.

తెలంగాణ జిల్లాల్లో టిడిపి నేతలను చేర్చుకోవడానికే కెసిఆర్ యాత్రలు చేస్తున్నారన్నారు. ఏ జిల్లాలో యాత్ర చేసి ఆ జిల్లాలో నేతలను టిఆర్ఎస్‌లో కలుపుకునే కుట్రలో భాగంగా ఆయన యాత్ర జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం మీ వల్ల నిలబడ లేదన్నారు. ఉద్యోగసంఘాలు, విద్యార్థుల వల్ల ఉద్యమం నడుస్తుందన్నారు. కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టే పద్ధతి మానుకోవాలన్నారు. మేం కేసిఆర్‌లా సంస్కార హీనంగా మాట్లాడ దల్చుకోలేదన్నారు. మీలాగ మాట్లాడాలంటే మాకు ఒక్క నిమిషం కూడా పట్టదన్నారు. కాని మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు.

English summary
TDP MLA Revanth Reddy blamed TRS president K Chandrasekhar Rao on trs merger in Congress party. He condemned KCR comments on TDP. He said KCR is making cash Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X