తెలంగాణ ప్రజల దృష్టిలో టిడిపి ఓ 420: ఈటెల రాజేందర్

ప్రజా ఆకాంక్షను గౌరవించలేని నాయకులు నాయకులే కాదన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులు రాజకీయంగా సమాధి కాక తప్పదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకు వెళుతూ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు ముందుకు వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
కాగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ సమస్యను మరింత జఠిలం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం తిరుపతిలో అన్నారు. భూకేటాయింపులలో అక్రమార్కులు 99 శాతం మంది కాంగ్రెసు వారే ఉన్నారని ఆరోపించారు. భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కమిటీ వేసే వరకు అసెంబ్లీని స్తంభింప జేస్తారని అన్నారు. రెండు నెలల్లో ప్రభుత్వం స్పందించకుంటే పేదలకు పంచుతామని అన్నారు.












Click it and Unblock the Notifications