ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ, ముహూర్తం ఫిక్స్..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. అటు వైసీపీ సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొత్త కార్యక్రమాలకు సిద్దం అవుతోంది. రెండేళ్ల పాలన పూర్తి కావటంతో.. ప్రజల్లోనే ఎక్కువగా ఉండాలని పార్టీ నేతలకు కూటమి పార్టీలు నిర్దేశం చేస్తున్నాయి. అంశాల వారీగా నిరసనలకు వైసీసీ సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే శాసన మండలిలో మరో రెండు స్థానాలు వైసీపీ నుంచి కూటమి ఖాతా లోకి వెళ్లనున్నాయి.
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ పోరు రోజుకో మలుపు తీసుకుంటోంది. కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలు కూటమికి దక్కనున్నాయి. వైసీపీ హయాం లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబుల పదవీ కాలం జూలై 27తో ముగియనుంది. ఇప్పటికే జకియా ఖానమ్ బీజేపీకి దగ్గరయ్యారు. ఇక.. ఈ రెండు స్థానాలు టీడీపీకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పలువురు టీడీపీ నేత లకు ఎమ్మెల్సీ స్థానాల పైన హామీ ఇచ్చారు. రాజ్యసభ.. ఎమ్మెల్సీ పదవులను ఇప్పటి వరకు అయిన ఖాళీల ను భర్త చేసారు. అయితే, పిఠాపురం వర్మ .. వంగవీటి రాధ కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో, తాజాగా వర్మ తో పాటుగా వంగవీటి రాధాకు కు ఇచ్చే పదవి పైన టీడీపీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే..
పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ గా కొద్ది రోజుల క్రితమే వర్మను బాధ్యతల నుంచి తప్పించారు. 2024 ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. పవన్ కు భారీ మెజార్టీ రావటం లో వర్మ క్రియాశీలకంగా పని చేసారు. పవన్ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. కాగా, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వర్మకు ఇవ్వకపోవటం పైన ఆయన మద్దతు దారుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఇప్పుడు మారుతున్న రాజకీయ లెక్కల వేళ వర్మతో పాటుగా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. 2019 నుంచి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ సీటు పై హామీ పెండింగ్ లో ఉంది. దీంతో, ఈ రెండు స్థానాలు ఈ ఇద్దరికీ దక్కుతుందని భావిస్తున్నారు. అయితే.. పలువురు సీనియర్లు రేసులో ఉండటంతో పాటుగా బీజేపీ, జనసేన నుంచి ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఇద్దరికీ ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications