సిఎం కిరణ్ కంప్లయింట్‌పై వివరణకు ఢిల్లీ వెళ్లిన జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన స్థానిక శాసనమండలి ఎన్నికలలో అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి వర్గం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతలో ఓటమికి జెసి దివాకర్ రెడ్డి కారణం అంటూ గురువారం అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే కాంగ్రెసుకే నష్టం అని చెప్పారు. ఈ నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలో కాంగ్రెసు ఓటమికి కారణాలు, తనపై ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ఫిర్యాదుకు వివరణ ఇచ్చేందుకు వెళ్లినట్లుగా తెలిస్తోంది.

కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి బహిరంగంగానే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై జెసి అప్పుడే ప్రశ్నించారు. కాంగ్రెసుకు, సోనియాగు కృతజ్ఞతలు తెలుపకుండా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తి కాంగ్రెసు వ్యక్తి కాదని ఆయన అప్పుడే అన్నారు. ఈ విషయాన్ని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లే అవకాశముంది. జగన్ కూడా అనంతపురంలో అభ్యర్థిని నిలపక పోవడం కాంగ్రెసును బద్ద శత్రువుగా భావించి బయటకు వెళ్లిన జగన్ వర్గం ఆయనకు మద్దతు తెలపడంపై ఆయన అధిష్టానానికి తెలిపే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+