వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసులోకి కాంగ్రెసు నేత ఇంద్రకరణ్ రెడ్డి?

జగన్ తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా, జగన్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఆయన కొనియాడారు. ఆయన మాటలు చూస్తుంటే జగన్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది. ఇప్పటి వరకు కొండా సురేఖ తెలంగాణ నుంచి పెద్ద దిక్కు. బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, గోనె ప్రకాశ రావు, రెహ్మాన్ వంటి నాయకులు ఉన్నప్పటికీ సీనియర్ నాయకులు లేని లోటు కనిపిస్తూ వచ్చింది. ఇంద్రకరణ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసులో చేరితే ఆ లోటు తీరుతుంది.