వివేకా హైజాక్ చేశారు, ఆయన మా వర్గం కాదు: కొండా సురేఖ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కాదని మాజీ మంత్రి జగన్ వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యే కొండా సురేఖ సోమవారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తుంటే మొదట అడ్డుకున్నది మేమే అని ఆమె చెప్పారు. అయితే లాస్ట్ మినట్‌లో వివేకా వచ్చి తమను హైజాక్ చేశారని ఆమె అన్నారు. వైయస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి మారెప్ప కూడా విరుచుకు పడ్డారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు అన్నారు. అయన అవినీతికి పాల్పడి ఇతరులపై విరుచుకు పడ్డారన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే గాలి ముద్దు కృష్ణమనాయుడు వైయస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు ప్రజలు రెండు సార్లు షాక్ ఇచ్చారన్నారు. చంద్రబాబు వైయస్‌పై ఆరోపణలు మానుకోవాలన్నారు.
Ex minister, Ex MP YS Jaganmohan Reddy camp congress MLA Konda Surekha said that they will not excuse if any one comment on YSR. She said YS Vivekananda is no Jagan's group.
Story first published: Monday, March 28, 2011, 15:27 [IST]