మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి తీరు సిగ్గు చేటు: ఎంపీ మధు యాష్కీ అనుమానం

వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై దాడి చేయడాన్ని యాష్కీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సభ్యులంతా ఓ నిర్ణయానికి వచ్చి స్పీకరు దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. కానీ ఇలా దాడి చేయడం మాత్రం సిగ్గు చేటన్నారు. ప్రజలు ఎన్నుకొని సభకు పంపించింది భౌతిక దాడులు చేయడానికి కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.
కాగా మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివరావు హత్యను ఆయన ఖండించారు. ఈ హత్యలో పోలీసులు, ప్రభుత్వం హస్తం ఉంటే వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సాంబశివుడు హత్య నిందుతులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications