అసెంబ్లీలో గాలిపై వైయస్ వివేకా, జగన్ వర్గం ఎమ్మెల్యేల దాడి

సభలో వైయస్ హయాంలో దొంగల ముఠా అని, వైయస్ భూపందేరాలు చేశారనే పలు ప్లకార్డులు పట్టుకొని టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ జెఎల్పీకి పట్టుబట్టారు. అయితే మంత్రి వివేకా, జగన్ వర్గం ఎమ్మెల్యేలు టిడిపి శాసనసభ్యుల వద్దకు చొచ్చుకు వెళ్లారు. టిడిపి ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ప్లకార్డులను వారు లాక్కున్నారు. దీంతీ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేశారు. అయితే సభను వాయిదా వేసిన అనంతరం ఇరువర్గాలు పరస్పర దూషణలకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇంతవరకు మాటల యుద్ధం మాత్రమే జరిగింది. కానీ సోమవారం వివేకా టిడిపి ఎమ్మెల్యేలపై దాడి చేయడం శోచనీయం. అయితే మంత్రి అహ్మదుల్లా వారిని వారించే ప్రయత్నాలు చేశారు.