చిరంజీవి, చంద్రబాబు ఎదురుపడ్డ వేళ, తమిళనాడు ప్రచార చర్చ

చంద్రబాబు తమిళనాడు వెళ్తున్నారా అని అడగ్గా అయిదు నుంచి ప్రచారం చేస్తున్నానని చిరంజీవి బదులిచ్చారు. 'నేనూ వస్తున్నా, కాకపోతే మీకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తరపున ప్రచారం చేస్తున్నా' అని చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు. అలాగే రండి అని చిరు కూడా నవ్వుల్లో జత కలిపారు. ఇంకా ఎక్కడెక్కడికి ప్రచారానికి వెళ్తున్నారంటూ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు అడగ్గా, పశ్చిమ బెంగాల్ కూడా వెళ్లాలనుకుంటున్నట్లు చిరంజీవి తెలిపారు. అక్కడే ఉన్న సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి స్పందిస్తూ - అలాగైతే మంచి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుని సీపీఎం కోసం ప్రచారం చేయండన్నారు. తాను తృణమూల్ కాంగ్రెస్ మంచి పార్టీగా భావిస్తున్నానని, ఆ పార్టీకి ప్రచారం చేస్తానని చిరు వ్యాఖ్యానించారు. ఈ విషయాల్ని అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చిరంజీవే మీడియాకు వివరించారు.
Comments
English summary
TDP president N Chandrababu will campaign in Tamil Nadu election for AIDMK. This was disclosed by Chandrababu to Chiranjeevi in assembly inner lobbies.
Story first published: Wednesday, March 30, 2011, 8:51 [IST]