హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూ కేటాయింపులపై సభా సంఘం, ఎట్టకేలకు అంగీకరించిన సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: అక్రమ భూ కేటాయింపులు జరిగాయని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సభాసంఘం వేసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటించారు. ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా పోకుండా కాపాడతామని స్పష్టం చేశారు.పరిశ్రమల పేరుతో పేదల పొట్టగొట్టి పెద్దలకు వేల ఎకరాలు కట్టబెట్టారని, దీనిపై సంయుక్త సభాసంఘం(జేఎల్‌సీ) వేయాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా సహా విపక్షాలు ముక్తకంఠంతో తొమ్మిది రోజులుగా ఉభయసభల్లోనూ పట్టుబడుతున్నాయి.

చివరకు శాసనసభలో భూ కేటాయింపులపై సోమవారం చర్చ చేపట్టి మంగళవారం ముగించింది. చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి.. జేఎల్‌సీపై ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో విపక్షాలు మరోసారి తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభాసంఘం వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఎట్టకేలకు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించి విచారణ పరిధిలోకి తీసుకురావాల్సిన భూ కేటాయింపులను ప్రభుత్వం త్వరలో నిర్ణయిస్తుంది. ఇందులో వక్ఫ్‌బోర్డు భూములు కేటాయించిన 23 సెజ్‌లు ఉంటాయని ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు.

జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ జారీచేసిన నోటీసులతో ప్రభుత్వానికి ప్రాథమిక సాక్ష్యాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా... ''ఒక వ్యక్తి, సంస్థకు సంబంధించిన పెట్టుబడుల అంశాన్ని ఆదాయపన్నుశాఖ చూసుకుంటుంది. మీరు ఇచ్చిన పిటిషన్‌ అన్ని శాఖలకు పంపించాం. అక్కడ నుంచి సమాధానం వచ్చిన తరవాత చర్యలు తీసుకుంటాం'' అని కిరణ్‌ చెప్పారు.

English summary
CM Kiran Kumar Reddy announced House Committee to enquire on land allocations. He said that his government will assure for transparency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X