కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు దెబ్బ: కామన్ సింబల్‌కు ఇసి నో, కాంగ్రెసు వివేకాస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇంత వరకు ఏ ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేయనందున కామన్ సింబల్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది. పార్టీ సింబల్ లేకుండానే వైయస్ జగన్ పులివెందుల, కడప శాసనసభ, పార్లమెంటు సీట్లకు పోటీ చేయాల్సి ఉంటుంది. పులివెందుల శాసనసభ సీటుకు పోటీ చేసే వైయస్ విజయమ్మకు, కడప పార్లమెంటు సీటుకు పోటీ చేసే వైయస్ జగన్‌కు వేర్వేరు చిహ్నాలు లభించే అవకాశాలున్నాయి. దేశంలోని మరో ఎనిమిది పార్టీలకు కూడా కామన్ సింబల్స్ ఇవ్వడానికి ఇసి నిరాకరించింది.

కడప, పులివెందుల ఉప ఎన్నికలకు ఇసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో విజయనగరం జిల్లాలో వైయస్ జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర ఆగిపోయే అవకాశాలున్నాయి. కడప జిల్లాలో పావులు కదపడానికి మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పావులు కదపడానికి సిద్ధపడడంతో జగన్ పూర్తిగా కడప, పులివెందుల ఉప ఎన్నికలపై తన దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. దానికోసం ఆయన ఓదార్పు యాత్రను మధ్యలోనే ఆపేసే అవకాశాలున్నాయి.

కాగా, వైయస్ జగన్‌ను దెబ్బ తీయడానికి వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు పార్టీ ప్రయోగిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు నాయకులే అంటున్నారు. అన్న కుమారుడు అని కూడా మర్చిపోయి వైయస్ వివేకానంద రెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు అంబటి రాంబాబు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ ప్రత్యర్థిగా మారి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు వాయిస్ వినిపిస్తున్నారని ఆయన అన్నారు. పథకం ప్రకారం కాంగ్రెసు పార్టీ వైయస్ వివేకా ద్వారా వైయస్సార్‌ను దూషింపజేస్తోందని ఆయన అన్నారు. కడప, పులివెందుల ఎన్నికలు తమ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు.

English summary
Election Commission rejected to give common symbol to YS Jagan's YSR Congress party. YS Jagan may stop his ongoing Odarpu yatra in Vijayanagaram district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X