హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను టార్గెట్ చేయడం లేదు: పిసిసి చీఫ్ డి శ్రీనివాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కాంగ్రెసు పార్టీ లక్ష్యంగా చేసుకోవడం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ బుధవారం అన్నారు. జగన్‌ను కాంగ్రెసు పార్టీ లక్ష్యంగా చేసుకుందనే వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొందరు కాంగ్రెసు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. పనిగట్టుగొని కాంగ్రెసుపై కొందరు బురద జల్లుతున్నారన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడంలో ఎలాంటి ఇతర కారణాలు లేవన్నారు. తన శాసనమండలి పదవి కాలం అయిపోయినందునే ఆయన రాజీనామా చేశారన్నారు. అంతకుమించి అందులో ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రాజీనామాను ఆమోదించలేదన్నారు. ప్రభుత్వం భూకేటాయింపుల కారణంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున సభాసంఘం ఏర్పాటు చేయడం సముచిత నిర్ణయమన్నారు. ఇది ఆహ్వానించ దగ్గదన్నారు.

English summary
PCC Chief D Srinivas said today that Congress party is not targeting Ex MP YS Jagan. He said agriculture minister YS Vivekananda Reddy give his resignation due to end of his MLC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X