మంత్రి పదవికి వివేకానంద రాజీనామా: అన్నను అవమానించారంటూ కన్నీళ్లు

వైయస్ పాలనలో జరిగిన భూకేటాయింపులపై ప్రభుత్వం సభాసంఘం వేయడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపం చెందినట్లుగా తెలుస్తోంది. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేసి ఆయనను అవమాన పరిచారని ఆయన భావిస్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దివంగత నేతపై అభాండాలు వేస్తూ సభాసంఘం వేశారనే ఉద్దేశ్యంతో ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే త్వరలో కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు ఉన్నందునే ఆయన రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. శాసనమండలి సభ్యుడిగా ఆయన పదవీ కాలం కూడా ముగియడం దీనికి కారణంగా పలువురు చెబుతున్నారు. రాజీనామా అస్త్రాన్ని ఎన్నికలలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాజీనామాపై విలేకరులు వివేకాను ప్రశ్నించగా సిఎంను అడగండి అని చెప్పారు.
Comments
ys vivekananda reddy ys jagan congress hyderabad వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
Agriculture minister YS Vivekananda Reddy was resigned for his ministry today. He resigned for house committee on late YS Rajasekhar Reddy ruling. He think that government is blamed YSR by house committee.
Story first published: Wednesday, March 30, 2011, 11:35 [IST]