అన్నాడియంకె నేత జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు?

ఇటీవలే జయలలిత పార్టీ ఎఏడిఎంకె పార్టీ పత్రిక ఎడిటర్ చో రామస్వామి రజనీకాంత్‌ను కలిశారు. అయితే రామస్వామి రజనీని కలవడంతో ఓటర్లు రజనీ జయలలితకు మద్దతు ప్రకటిస్తారనే భావనలో పడిపోతారనే అనుమానం డిఎంకెకు వచ్చింది. వెంటనే ఉపముఖ్యమంత్రి అళగిరి తర్వాత రోజు రజనీని కలిశారంట. అయితే రజనీ డిఎంకెకు మద్దతు ప్రకటించక పోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. రజనీ జయలలితవైపే మొగ్గు చూపుతారని పలువురు భావిస్తున్నారు. అయితే గతంలో ఓసారి రజనీ జయలలితకు వ్యతిరేకంగా ఓటు వేయమని తన అభ్యర్థులను కోరారు. అవినీతి జయ ప్రభుత్వాన్ని సమర్థించవద్దని చెప్పారు. ఆ ఎన్నికల్లో జయ ఓటమి చవి చూసింది.
ఒకటి డిఎంకె కూటమి భారీ కుంభకోణాల్లో కూరుకు పోవడం కాగా మరొకటి పిఎంకె పార్టీ. తాజా ఎన్నికలలో పిఎంకె పార్టీ డిఎంకెతో జట్టుకట్టింది. అయితే గతంలో రజనీ బాబా చిత్రం విడుదల అయినప్పుడు ఆ చిత్రాన్ని పిఎంకె వ్యతిరేకించింది. దానిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో చిర్రెత్తిన రజనీ 2004 ఎన్నికల్లో పిఎంకెను ఓడించాలని అభిమానులను కోరారు. ఆ పిఎంకె కూటమి ఇప్పుడు డిఎంకెతో కలిసి ఉంది. మరో ముఖ్య విషయం తమిళనాట ఏ పార్టీ రెండుసార్లు వరుసగా గెలుపొందలేదు.