కడప: కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ రథం సిద్ధమైంది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృత ప్రచారానికి అనువుగా ఈ రథాన్ని సిద్ధం చేశారు. ఇదే వాహనాన్ని వైయస్ జగన్ 2009 ఎన్నికల్లో వాడారు. ఆయన ఎన్నికల్లో ఆయన కొందరు అభ్యర్థుల తరఫున కాంగ్రెసు పార్టీ నాయకుడిగా ప్రచారం చేశారు. అప్పుడు వాహనానికి ఆయన కొన్ని మార్పులు చేశారు.
ప్రచార రథంలో జగన్ విశ్రాంతి తీసుకోవడానికి, కీలక నేతలతో మంతనాలు జరపడానికి ఏర్పాట్లు ఉన్నాయి. వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే వెసులుబాటు కూడా ఉంది. కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభా నియోజకవర్గాల్లో కూడా వైయస్ జగన్ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వాహనంపై పార్టీ జెండా, వైయస్సార్ చిత్రాలు ఉన్నాయి. అలాగే, పులివెందుల శాసనసభా స్థానం అభ్యర్థి విజయమ్మ బొమ్మ, వైయస్ జగన్ చిత్రం కూడా వాహనంపై ఉన్నాయి.
YSR Congress leader YS Jagan vehicle is prepared to campaign in Kadapa loksabha seat and Pulivendula seat. This vehicle was used by YS Jagan in 2009 election. few changes were done to the vehicle.
Story first published: Friday, April 1, 2011, 11:49 [IST]