తెలంగాణ సాధన కోసం ప్రత్యేక యాక్షన్ కమిటీ: టి-ఎంపీల నిర్ణయం

మే తర్వాత ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ కమిటీని వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలతో కేంద్రానికి ఓ లేఖను కూడా రాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇతర అంశాల జోలికి వెళ్లకూడదని, అలా చేస్తే ముఖ్యమైన తెలంగాణ అంశం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని వారు భావించినట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెసు ఆధ్వర్యంలో వేసే కమిటీ ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్రానికి తెలంగాణ సెంటిమెంటు ప్రధాన్యత చెప్పాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. తాము తెలంగాణ తప్ప తమకేమీ అవసరం లేదని ఆజాద్‌కు చెప్పినట్లుగా వివరించారు. శ్రీకృష్ణ కమిటీనే పరిగణలోకి తీసుకోనప్పుడు ఆ కమిటీ అందజేసిన 8వ అధ్యాయం గురించి ఆందోళన అవసరం లేదని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల వరకే వారు కేంద్రానికి డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications