జగన్‌పై పోటీ చేస్తా, సచిన్‌కు భారతరత్న ఇవ్వాలి: మంత్రి శంకర్‌రావు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చేనేత జౌళి శాఖ మాత్యులు శంకర్‌రావు మంగళవారం అన్నారు. పార్టీ అదేశిస్తే కడప పార్లమెంటునుండి అయినా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మధ్య ఈ ఉప ఎన్నికలు అని జగన్ చెప్పడాన్ని ఆయన ఖండించారు.
జగన్ వ్యాఖ్యలు ఆయన అవివేకం అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాబూ జగ్జీవన్ రామ్, సునీల్ గవాస్కర్‌లకు భారతరత్న ఇవ్వాలని ఆయన అన్నారు. చేనేత సొసైటీలోబోగస్ ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కుంభకోణంలో ఎంత పెద్ద వారు ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Minister Shankar Rao said that today he is ready to contest from Kadapa or Pulivendula constituencey in byelection, if high command give ticket. He blamed YS Jagan for his comments.
Story first published: Tuesday, April 5, 2011, 13:49 [IST]