కడప అభ్యర్థి: కందులపై డిఎస్, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు

కాగా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న కందుల రాజమోహన్ రెడ్డికి కడప లోకసభ సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కందుల శివానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, తెలుగుదేశం నుంచి వచ్చిన వెంటనే కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని డి. శ్రీనివాస్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఆయన విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా కందుల రాజమోహన్ రెడ్డి కడప లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications