రాష్ట్రంలో బిజెపి రాజకీయ శక్తిగా ఎదుగుతుంది: రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

రాష్ట్రంలో బిజెపికి త్వరలో మంచి రోజులు రానున్నాయని అన్నారు. 2014లో ఎన్డీయే జాతీయ రాజకీయాలను శాసిస్తుందని అన్నారు. పూర్తి అవినీతిలో కూరుకు పోయిన కాంగ్రెసు పార్టీని వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని, బిజెపికి పట్టం గడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు అవినీతిని ప్రజలముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో జన సంఘర్ష్ ర్యాలీలు ఈ రోజునుండి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.