డిఎల్ రవీంద్రా రెడ్డికి వైయస్ జగన్‌పై కడపలో పోటీ తప్పదా?

తెలుగుదేశం నుంచి కాంగ్రెసులోకి వచ్చిన కందుల రాజమోహన్ రెడ్డి జగన్‌పై పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారు. కాంగ్రెసులో చేరినప్పటికీ పోటీకి మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. కందుల శివానంద రెడ్డిని పోటీకి దించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అయితే, కందుల శివానంద రెడ్డి కూడా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పోటీ చేయవద్దని కందుల బ్రదర్స్ కుమారులు, బంధువులు వారికి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో డిఎల్ రవీంద్రారెడ్డి పోటీకి దిగక తప్పదనే మాట వినిపిస్తోంది. మొదటి నుంచీ వైయస్ జగన్‌ను రవీంద్రా రెడ్డి ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications