అవినీతిపై పోరు, హైదరాబాదులో చంద్రబాబు పాదయాత్ర, ప్రతిజ్ఞ
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: సామాజిక కార్యకర్త అన్నా హజారే దీక్ష నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాదులో పాదయాత్ర నిర్వహించారు. ఆయన పాదయాత్ర సికింద్రాబాద్ నుంచి హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయన అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. దేశంలోని అవినీతిపై యువత ఆందోళన చెందుతోందని, కోపంగా ఉందని ఆయన అన్నారు. అవినీతిపై మేధావులు బాధపడుతున్నారని ఆయన చెప్పారు. దోపిడీకి పాల్పడినవారి సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచాలని ఆయన కోరారు.
అవినీతిపరులను సంఘ విద్రోహులుగా ప్రకటించి, వారికి సాంఘిక బహిష్కరణ విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యం పెంపొందించడానికే తాను పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. అవినీతి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని ఆయన అన్నారు. జన్ లోకపాల్ బిల్లు ప్రజలు సాధించిన విజయమని ఆయన అన్నారు. అవినీతిపరులు భయపడి మారే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. ప్రజా ధనాన్ని దోపిడీ చేసినవారిని ప్రాసిక్యూట్ చేయాలని ఆయన సూచించారు.
TDP president N Chandrababu Naidu organized padayatra opposing corruption. His padayatra began in Secunderabad and ended at Ambedkar statue in Hyderabad.
Story first published: Saturday, April 9, 2011, 12:42 [IST]