వైయస్ జగన్ వల్ల రూ.100 కోట్లు నష్టం: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల నష్టమని కడప కాంగ్రెసు పార్లమెంటు అభ్యర్థి, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆదివారం అన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఆయనకు ఎన్నడూ ప్రజా సంక్షేమం, బాగోగులు, అభివృద్ధి పట్టదు అన్నారు.
ప్రజా సంక్షేమం ఎన్నడూ పట్టించుకోని వ్యక్తి సువర్ణ పాలన తెస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. జగన్ రాజీనామా చేసి అనవసరంగా ఉప ఎన్నికల బరువును ప్రజలపై రుద్దారన్నారు. ఆయన చేసిన పని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు రూ.వంద కోట్లు నష్టమన్నారు.