నేను జ్యోతిష్కుడను కాను, కాంగ్రెసుదే గెలుపు: జెసి దివాకర్ రెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చెప్పడానికి తాను జ్యోతిష్కుడను కానని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆదివారం పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి ఆయన పుట్టపర్తి వచ్చారు. వైద్యులను బాబా ఆరోగ్యంపై గురించి అడిగి తెలుసుకున్నారు.
లోక కళ్యాణం కోసం బాబా తప్పకుండా చాలాకాలం జీవిస్తారని చెప్పారు. కడప, పులివెందులలో కాంగ్రెసు పార్టీ విజయం ఖాయమని చెప్పారు. ఉప ఎన్నికలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గెలుపు మాత్రం ఖాయమని చెప్పారు. పార్టీ ప్రచారం చేసే బాధ్యతలు అప్పగిస్తే ప్రచారానికి తప్పకుండా వెళతానని చెప్పారు. కడప, పులివెందులకు సరైన అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందన్నారు.