డిఎల్‌కు కొండా సురేఖ సవాల్: సోనియా, వైయస్ మధ్యే యుద్ధం అన్న జగన్

డిఎల్ మొదట తన నియోజకవర్గంలో ఆధిక్యంతో గెలిచి తర్వాత మిగిలిన వారి గురించి మాట్లాడాలన్నారు. వైయస్ పేరు ఎత్తే అర్హత డిఎల్‌కు లేదన్నారు. కడప, పులివెందులలో జగన్, విజయమ్మ భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్టే జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పేదల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చల్లబసాయిపల్లెలో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి, వైఎస్ఆర్ కు సోనియాకు, కడపకు, ఢిల్లీకి మధ్య జరిగే యుద్ధం అన్నారు. విశ్వసనీయతను పక్కన పెట్టితే తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చేదని అలా అయితే ఈ ఉప ఎన్నికలు వచ్చేవి కావన్నారు.