భారతి, బ్రాహ్మిణీలు జీరో వ్యాపారం: జగన్ వ్యాపారాలపై డిఎల్ కన్ను

బ్రాహ్మిణి స్టీల్స్ విషయంలో యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. తప్పుడు నివేదికలతో యాక్సిస్ బ్యాంకు నుండి రూ.350 కోట్లు తీసుకున్నారని అన్నారు. రాయల్టీలు చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణితో పాటు భారతీలో కూడా జీరో వ్యాపారం సాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా వైయస్ బొమ్మ పెట్టుకునే హక్కు కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందని డిఎల్ అన్నారు. జగన్‌కు లేదన్నారు. వైయస్ 2014లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని నిశ్చయించుకున్నారని అన్నారు. అందుకు మేం శాయశక్తులా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపి మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications