కేంద్రమంత్రి షిండే ప్రధాని అయ్యే అవకాశం!: గుంటూరు ఎంపీ రాయపాటి
Districts
oi-Srinivas G
By Srinivas
|
గుంటూరు: కేంద్ర మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు షిండే ప్రధాని అయ్యే అవకాశం ఉందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆదివారం వ్యాఖ్యానించారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలలో గెలుపు ఖచ్చితంగా కాంగ్రెసు పార్టీదే అని అన్నారు. కాంగ్రెసు పార్టీ ఆ రెండు నియోజకవర్గాలను నిలుపుకుంటుందని చెప్పారు.
తిరుమల తిరుమతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే తాను టిటిడి చైర్మన్ అవుతానని అన్నారు. వెంకన్న ఆశీస్సులు ఎప్పుడు ఉంటే అప్పడే అవుతానని అన్నారు. అయితే తన పేరు ఇంకా చైర్మన్ పదవికి ఖరారు కాలేదన్నారు.
Gunturu MP Rayapati Sambasiva Rao said that central minister Shindey have chances to became prime minister. He hoped that congress will win in Kadapa by-pole.
Story first published: Sunday, April 10, 2011, 16:34 [IST]