విమర్శలు ఆ వెనుకే చేయి చేయి కలిపారు!: కృష్ణాలో లగడపాటి, సర్వేల తీరు

లగడపాటి సమైక్యాంధ్ర అంటూ స్జేజి డ్రామాలు నడపడం సరికాదని అంతకుముందు సర్వే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. లగడపాటి అంటే జగడపాటి అని అనిపించుకోవద్దని సూచించారు. తాను వివాదాలకు వ్యతిరేకం అన్నారు. జాగో తెలంగాణ బాగో ఆంధ్రావాలా వంటి నినాదాలకు తాను దూరం అన్నారు. తెలంగాణలో కూడా ఆంధ్రావాళ్లు సంతోషంగా ఉండాలన్నారు.
కాకాని స్ఫూర్తితో తీసుకొని లగడపాటి సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రానికి నడుం బిగించాలని కోరారు. అప్పుడు ఆయనకు ఇరుప్రాంతాల ప్రజల మద్దతు ఉంటుందన్నారు. సీమాంధ్రకు లగడపాటి కంకణం కట్టుకోవాలని సూచించారు. కాగా తన వద్దకు కొత్త పంచాయతీలు తేవద్దని లగడపాటి వ్యాఖ్యానించారు.