ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య అదే వ్యత్యాసం ఉంది: వడ్డె శోభనాద్రిశ్వరరావు
Districts
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నేత ఎన్టీఆర్‌కు, ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు మధ్య వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రిశ్వరరావు ఆదివారం అన్నారు. బడా పారిశ్రామికవేత్తలను, వ్యాపారస్తులను ఎన్టీఆర్ ఎప్పుడు దూరంగా ఉంచేవారన్నారు. ఆయన ప్రజలకే ప్రధాన్యత ఇచ్చేవారన్నారు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. అందుకే ఆయన ప్రజలకు దూరం అయ్యారన్నారు.
తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నాయకత్వం లోపించిందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో దానిని భర్తీ చేయగలం అని సూచించారు. ఎన్టీఆర్ కుటుంబం ఎప్పుడు కూడా చంద్రబాబుకు అన్యాయం చేయలేదని చెప్పారు. బెజవాడ టిడిపిలో విభేదాలు ఉన్నాయని అన్నారు. అయితే మీడియాకు ఎక్కడం మాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.