వైయస్ఆర్ కాంగ్రెసు నుండి బాషా నామినేషన్, జగన్‌కు చిక్కులు!

వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ పేరుతో తాను 2009లోనే ఈసికి దరఖాస్తు చేసుకున్నానని, అయితే నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఆ పార్టీ తనది అనడంతో తాను హైకోర్టుకు వెళ్లానని, కేసు హైకోర్టులో ఉన్నప్పుడు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని శివకుమార్ జగన్‌కు తన పార్టీని ఇచ్చాడని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా దానికి ఆమోదం తెలిపిందని అన్నారు. అయితే ఈసి ఇలా చేయడం సరికాదన్నారు. విషయం కోర్టులో ఉన్నప్పుడు పార్టీని ఒకరికి కేటాయించడం సరికాదన్నారు. అందుకే తాను వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేయడానికి నిశ్చయించుకున్నానని చెప్పారు.
తన నామినేషన్ వెనుక ఎవరి కుట్ర లేదన్నారు. కాంగ్రెసుకు గానీ, టిడిపికి గానీ తన నామినేషన్ తో సంబంధం లేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు తామంతా ఆయనకు మద్దతు ఇచ్చాని, ఆయన మీద అభిమానంతో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ స్థాపించుకున్నామన్నారు. ఎన్నికలలో పోటీ చేస్తానని, అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తానని అన్నారు. జగన్ వెంట మైనార్టీలు లేరన్నారు. సగం ఉర్దూ, సగం తెలుగు వచ్చిన రెహమాన్ మాత్రం ఉన్నారన్నారు. తెలంగాణ వాదాన్ని పట్టుకు వెళ్లాడుతున్న కొండా సురేఖ ఉందన్నారు. టిడిపి కూడా రెండు కళ్ల సిద్ధాంతంతో వెళుతుందన్నారు.












Click it and Unblock the Notifications