మరింత మంది జగన్ ఎమ్మెల్యేలు కాంగ్రెసులోకి వస్తారు: డిఎల్

కమలమ్మ రేపటి నుంచి కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం సాగిస్తారని ఆయన చెప్పారు. కమలమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను హైదరాబాదులో కలిశారని, ఆ తర్వాత కడప జిల్లా కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వచ్చారని ఆయన చెప్పారు. కమలమ్మ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలని కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి చెప్పారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే కడప నుంచి పోటీ చేస్తున్నట్లు రవీంద్రా రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోయినందున మంత్రిగా కొనసాగడం మంచిది కాదని వైయస్ వివేకానంద రెడ్డి భావించి రాజీనామా చేశారని, తాను శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఆయన అన్నారు.