తగరకుంట కొండా రెడ్డి హత్య కేసులో పరిటాల సునీత సోదరుడి అరెస్టు

Paritala Sunitha
అనంతపురం: అనంతపురం జిల్లాలో తగరకుంట కొండా రెడ్డి హత్య కేసులో పోలీసులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత సోదరుడు బాలాజీని అరెస్టు చేశారు. బాలాజీతో పాటు పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. వారిని మంగళవారం పోలీసులు మీడియా ప్రతినిధుల ముందు హాజరు పరిచారు. తగరకుంట కొండా రెడ్డి హత్య కేసులో వీరు ప్రధాన నిందితులని పోలీసులు చెప్పారు.

నిందితుల నుంచి పోలీసులు మూడు తుపాకులు, నాలుగు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. తగరకుంట కొండా రెడ్డి పరిటాల రవీంద్ర హత్య కేసులో 14వ ముద్దాయిగా ఉన్నాడు. పరిటాల రవి హత్యకు ప్రతీకారంగానే వీరు తగరకుంట కొండా రెడ్డిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ముఠా కక్షల్లో భాగంగానే తగరకుంట కొండా రెడ్డి హత్య జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+