వైయస్ జగన్‌కు మరో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఝలక్, తిరిగి కాంగ్రెసులోకి?

కమలమ్మ బద్వేలు నియోజకవర్గంలో జగన్ వర్గం నాయకుడు గోవింద రెడ్డితో పొసగక తిరిగి కాంగ్రెసులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పార్లమెంటు ఉప ఎన్నికలలో కూడా గోవిందరెడ్డితో కలిసి ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ పనిచేయాలని జగన్ ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, వై.వి. సుబ్బారెడ్డిలు ఆమె స్వగహంలో చర్చలు జరిపి కాంగ్రెస్‌కు వెళ్లే ప్రయత్నం మానుకోవాలని కోరారు. జగన్ వర్గంలో ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని, ఆమె ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినా ఆమె వినకుండా తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు.












Click it and Unblock the Notifications